Thursday, 17 September 2026 02:11:05 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం – రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ నుంచి రూ.98,888 దోపిడి

Date : 05 March 2026 04:41 PM Views : 106

DNB News - తెలంగాణ / : రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ పరిధిలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. హిమాపురి కాలనీ, కేబీఆర్ కన్వెన్షన్ సమీపం, మంసూరాబాద్ నివాసి కంచర్ల సత్యనారాయణ రెడ్డి (66), రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రూ.98,888లు కాజేశారు. ఫిర్యాదు ప్రకారం, 28-02-2025న ఆయనకు తెలియని మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె తనను “మెఘనా రెడ్డి” అనే సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పరిచయం చేసుకుని, ఆయన పేరుతో నమోదైన మొబైల్ నంబర్ ద్వారా ఉగ్రవాదులకు గోప్య సమాచారం పంపుతున్నారని తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ కేసులో ఆయనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పి, మరో వ్యక్తికి కాల్‌ను కలిపింది. ఆ వ్యక్తి తనను ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం బలవంతంగా తీసుకున్నాడు. భయపెట్టేందుకు Enforcement Directorate పేరిట నకిలీ కేసు రిపోర్ట్, అలాగే National Investigation Agency పేరిట గోప్యతా ఒప్పందం వంటి కృత్రిమ పత్రాలను పంపించారు. తక్షణ అరెస్టు చేస్తామని బెదిరిస్తూ “దర్యాప్తు ప్రక్రియ”లో భాగంగా డబ్బులు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో భయాందోళనకు గురైన సత్యనారాయణ రెడ్డి ఫోన్‌పే ద్వారా మొత్తం రూ.98,888లు బదిలీ చేశారు. అనంతరం ఇది పోలీసు, సీబీఐ లేదా ఈడీ అధికారుల పేరుతో మోసం చేసే “డిజిటల్ అరెస్ట్” స్కామ్ అని గ్రహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు క్రైమ్ నెం. 285/2026గా నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4), 319(2)తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 66(C), 66(D) కింద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు ప్రజలకు సూచిస్తూ, అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు అడిగితే వెంటనే నమ్మకూడదని, అనుమానం ఉంటే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :