Thursday, 17 September 2026 04:40:18 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

నమ్మిన సిద్ధాంతం కోసం, దేశ ప్రజల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ - చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం

Date : 23 January 2026 05:02 PM Views : 114

DNB News - తెలంగాణ / : స్వాతంత్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేడు నగరంలోని సుభాష్ నగర్ లో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం హాజరై కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ , సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి , గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తో పాటు పలువురు నేతలతో కలిసి సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులు, అఖిలభారత కాంగ్రెస్ కు రెండుసార్లు అధ్యక్షులుగా వ్యవహరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్రం సిద్ధిస్తుంది అని నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థను స్థాపించి ఆంగ్లేయులు అనేకసార్లు జైల్లో నిర్బంధానికి గురిచేసి ఇబ్బందులు పెట్టినా నమ్మిన సిద్ధాంతం కోసం ఈ దేశ ప్రజల కోసం అహర్నిశలు పోరాడిన గొప్ప వ్యక్తి నేడు వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను నేటి యువత పునికి పుచ్చుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారి ఆశ సాధన కోసం కృషి చేస్తుందని జిల్లా కాంగ్రెస్ పక్షాన ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ,సుడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,గ్రంధాలయ చైర్మన్ సత్తు మల్లేశం, బానోతు శ్రావణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, గంట కళ్యాణి శ్రీనివాస్, కుర్ర పోచయ్య, అమీర్, చర్ల పద్మ, మహమ్మద్ అజీమ్, మూల రవీందర్ రెడ్డి, దండి రవీందర్, వంగల విద్యాసాగర్, ముస్తాన్, తంగేళ్ల కిరణ్, ఈశ్వరి, వసీం, శిల్ప, మాదాసు శ్రీనివాస్, సత్తినేని శ్రీకాంత్, తోట అంజయ్య, సిరికొండ శివప్రసాద్, యనమల మంజుల, షబానా మహమ్మద్ హనీష్, బత్తుల రాజు కుమార్, ఇమ్రాన్, రోళ్ళ సతీష్, ముల్కల కవితయోన, ఫజల్, గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: