Saturday, 19 September 2026 08:28:01 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కన్నతండ్రే కాలయముడు!

Date : 04 April 2026 06:11 PM Views : 97

DNB News - తెలంగాణ / : కరీంనగర్ జిల్లా: ఏప్రిల్ 04 కరీంనగర్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది, కసాయి తండ్రి కన్న బిడ్డలను బావిలోకి తోసేసి చంపేశాడు ఈ విషాద ఘటన కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్లో చోటు చేసుకుంది, కన్నబిడ్డలకు రక్షణగా ఉండాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ గ్రామంలో శుక్రవారం సా యంత్రం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి ని కలిగించింది. ఆడపిల్లలు పుట్టారని గొడవల నేపథ్యంలో ఇద్దరు కవల ఆడపిల్లలను తండ్రి ముందుగా గడ్డి మందు తాగించి బావిలోకి తోసేసి చంపడం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీనగర్‌కు చెందిన కచ్చు శ్రీశైలంకు ఆరేళ్ల క్రితం మానకొండూరు మండలం లక్ష్మీపూర్‌కు చెందిన మౌనికతో వివాహమైంది. వీరికి గీతాంశీ, గీతాన్విక (4) అనే ఇద్దరు కవలు జన్మించారు. అయితే, కొంతకాలంగా ఆడపిల్లలు పుట్టారనే కారణంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం శ్రీశైలం తన ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకొని పొలానికి వెళ్లాడు. పొలానికి తీసుకువెళ్లిన పిల్లలను శ్రీశైలం కావాలనే బావిలోకి తోసేసి చంపినట్టు కుటుం బ సభ్యులు ఆరోపిస్తున్నా రు. బావిలో గాలించగా గీతాంశీ మృతదేహం నీటిపై తేలింది. కాగా, మరో కుమార్తె గీతాన్విక ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు బావిలో, పరి సర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటనా స్థలా న్ని ఏసీపీ విజయ్‌కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. నిందితుడు శ్రీశైలంను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: