DNB News - తెలంగాణ / : ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీర్వాదం ఈ ప్రాంత ప్రజలపై ఉండి సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి అనేక సార్లు వచ్చాను.. తెలంగాణ రాష్ట్రం రావాలని స్వామివారిని మొక్కుకున్న.. రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో స్వామివారిని దర్శించుకున్న ప్రజా పాలన ప్రభుత్వంలో ఎమ్మెల్యే , అలయ చైర్మన్ , దాతలుతో అభివృద్ధి చేస్తున్నారు.. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రారంభమైనటువంటి కళ్యాణ మండపం పెండింగ్లో ఉంది.. స్థానిక శాసనసభ్యులు సహకారంతో కళ్యాణమండపం పూర్తిచేసే బాధ్యత నాది.. దానిని ప్రజల వినియోగంలోకి తీసుకొస్తాం.. స్థలానికి సంబంధించి దేవాదాయ శాఖ భవిషత్ అవసరాలకు చర్యలు తీసుకుంటాం.. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ,ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ,నల్లగొండ లక్ష్మి నరసింహ స్వామి వార్ల ఆశీర్వాదం ఉండాలి.. ఈ ప్రాంత ప్రజలకు ప్రజలకు విజయాలు కలగాలని కోరుకుంటున్న అన్నారు.
Admin
DNB News