Tuesday, 03 November 2026 01:47:27 PM
# మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!!

లక్ష్మీపురం స్కూల్ పనుల్లో వేగం పెంచండి అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

Date : 22 March 2026 02:40 PM Views : 126

DNB News - తెలంగాణ / : విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. విద్య కోసం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు. ఆదివారం మధిర నియోజకవర్గం లో పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణం అవుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. నిర్మాణ దశలో ఉన్న భవన సముదాయాలను కలియతిరుగుతూ ఆయన పరిశీలన చేశారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను, గుత్తేదారులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ సందర్భంగా జూనియర్ హాస్టల్, జూనియర్, సీనియర్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి విక్రమార్క. అంతేకాకుండా మెకానికల్, సైన్స్, మ్యాథమెటిక్స్ , కంప్యూటర్ ల్యాబ్ భవనాల నిర్మాణాలను పరిశీలన చేశారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దు అని ఆయన చెప్పారు. ఇవి కేవలం భవనాలు కాదు రేపటి తరాలను ఉజ్వలంగా నిర్మించే దార్శనిక దేవాలయాలుగా ఆయన అభివర్ణించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :