Wednesday, 04 November 2026 09:22:03 AM
# దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ లకు సుప్రీం కోర్ట్ గుడ్ న్యూస్...✍️ # ఆదోని మున్సిపల్ చైర్‌పర్సన్‌గా స్వప్న న్యాయకర్ విజయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం.. # సొంత ఖర్చులతో యూరప్ టూర్‌కు భారత షట్లర్లు..!! # మానవత్వం చాటిన కానిస్టేబుల్ దీప..!! # మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..?

అశ్వారావుపేటలో 'ఉప్పల' గర్జన తో అశ్వరావుపేట ముఖచిత్రం మారనుంది అధికార పార్టీకి గుండెదడ

Date : 06 February 2026 05:18 PM Views : 174

DNB News - తెలంగాణ / : మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో అశ్వారావుపేట రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ అశ్వరావుపేట కెమిలాట్స్ గెస్ట్ హౌస్ లో విలేఖర్ల సమావేశంలో చేసిన ప్రసంగం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. 13వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి సంకుల స్వరూప విజయాన్ని అడ్డుకోవడం ఎవరి తరము కాదని, బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని ఆయన చేసిన హెచ్చరికలు స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ​దొరల పెత్తనమా? ప్రజల పౌరుషమా? ​కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మదంతో చక్రం తిప్పుతామని విర్రవీగుతున్నారని, కానీ వారి ఆటలు అశ్వారావుపేటలో సాగవని ఉప్పల వెంకటరమణ ఘాటుగా విమర్శించారు. మేము తలుచుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని, ఇది ప్రజల పౌరుషానికి, మీ అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కోటలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా 13వ వార్డులో బడుగు, బలహీన వర్గాలు ఏకతాటిపైకి రావడంతో అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. ​400 పైచిలుకు మెజారిటీ ఖాయం.. ఇది వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు! 13వ ​వార్డులోని గొల్ల కురుమ సామాజిక వర్గంతో పాటు మెజారిటీ ఓటర్లు సంకుల స్వరూప వైపు నిలిచారని, దాదాపు 400 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు దిగినా అశ్వారావుపేట ప్రజలు తలవంచరని, బ్యాలెట్ బాక్సుల ద్వారా సమాధానం చెబుతారని హెచ్చరించారు. తమ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా అశ్వారావుపేట ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని ఉప్పల వెంకటరమణ గర్జించారు. ​అశ్వారావుపేటలో మారిన రాజకీయ సమీకరణాలు ఉప్పల వెంకటరమణ ప్రసంగంతో కాంగ్రెస్ డిఫెన్స్‌లో! పడిపోయిందని, బెదిరింపులకు భయపడం మా అభ్యర్థి స్వరూపమ్మను గెలిపించుకుంటామని, ​13వ వార్డులో బిఆర్ఎస్ జెండా ఎగరడం చారిత్రక అవసరమని, ​కాంగ్రెస్ నాయకులూ మీ గడీల పాలన ఇక సాగదని బిఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :