DNB News - తెలంగాణ / : తెలంగాణ లో కోతుల బెడద అంతా ఇంతా కాదు. నిత్యం చాలా గ్రామాల్లో ప్రజలపై దాడులు చేస్తున్నాయి. ఇవాళ సూర్యాపేట(D) వల్లాపురంలో ఓ బాలుడి ప్రాణాన్ని బలిగొన్నాయి. గ్రామానికి చెందిన నిశాంక్ (12) అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా కోతులు వెంటపడ్డాయి. భయంతో కిందపడిపోయిన అతడి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా హార్ట్ ఎటాక్‌తో చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు..!!
Admin
DNB News