Sunday, 01 November 2026 03:36:25 AM
# ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..? # మీర్పేట్ కానిస్టేబుల్ అరెస్ట్..!! # జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం

రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం..!!

Date : 29 October 2026 03:44 PM Views : 26

DNB News - india / : రైళ్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వే బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల మధ్యలో అన్ని ఛార్జింగ్ పాయింట్లు మూసివేసి ఉంచాలని, ఆ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అన్ని జోన్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల ముంబయి లోకల్ రైలులో ఛార్జింగ్ పెడుతుండగా.. ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలిపోయిన సంగతి తెలిసిందే . దాంతో కోచ్ అంతా దట్టమైన పొగ నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 11 గంటల నుంచి ఆరు గంటల పాటు రైళ్లలోని కోచ్లలో ఉన్న మొబైల్, ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్లు స్విచ్ఛాఫ్ చేసేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అన్ని జోన్లకు బోర్డ్ సూచించింది. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ భద్రతా చర్యలను అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించింది. రాత్రి సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటం వల్ల ఓవర్ హీటింగ్, షార్ట్ సర్క్యూట్ జరిగితే వెంటనే గుర్తించడం కష్టమవుతోంది. దాంతో భారీ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ఈ ముందు జాగ్రత్త చర్య చేపట్టారు. అయితే.. రైళ్లలో రాత్రి పూట ఛార్జింగ్పై ఆంక్షలు 2014లోనే తీసుకువచ్చారు.తాజా ఘటన నేపథ్యంలో వీటిని కట్టుదిట్టంగా అమలు చేసేలా రైల్వే బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది..!!

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: