DNB News - తెలంగాణ / : దంచికొట్టిన వర్షంతో హైదరాబాద్లో రోడ్లపై వరద పోటెత్తింది. మాదాపూర్ విఠల్రావునగర్లో బైకుపై వెళ్తుండగా రోడ్డుపై వరద నీటి హోరుకు జెప్టో డెలివరీ ఎగ్జిక్యూటివ్ అర్జున్ అదుపుతప్పి నాలాలో పడిపోయారు. వెంటనే గమనించిన పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమయస్పూర్తితో కాపాడారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణించవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు..!!
Admin
DNB News