DNB News - తెలంగాణ / : ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించా లని అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి.శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి.శ్రీజ పి. శ్రీనివాస్ రెడ్డి ప్రజల అర్జీలను స్వీకరించారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన రాయల గోవింద రావు పీఎం ఉపాధి కల్పన పథకం క్రింద ఈడిపి ట్రైనింగ్ అందుబాటులో లేకపోవడం ఆన్లైన్ పోర్టల్ లోపల లోన్ ప్రాసెస్ ఆలస్యం అవుతున్న విషయం గురించి ఫిర్యాదు అందించగా కే.వి.ఐ.బి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. కొణిజెర్ల మండలం చిన్న గోపతీ గ్రామానికి చెందిన జి. ప్రసాద్ రావు తనకు సర్వే నెంబర్ 131 లో 39 గుంటల భూమి ఉందని, 19.5 గుంటల భూమి పట్టా పాస్ పుస్తకం ఉందని, మిగిలిన 19.5 గుంటల భూమి పట్టా పుస్తకం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం అర్బన్ మండలం అల్లిపురం గ్రామానికి చెందిన ఎస్కే హుస్సేన్ తనకు 4 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చిందని , తనకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా డిఆర్డిఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ పద్మశ్రీ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News