Thursday, 17 September 2026 06:22:29 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

రైతులను ముంచుతున్న ఫర్టిలైజర్ షాప్ యజమానులు....

Date : 09 March 2026 03:37 PM Views : 119

DNB News - తెలంగాణ / : మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఉన్న ఫర్టిలైజర్ షాపుల యజమానులు రసీదులలో యూరియా బస్తా 266, రూపాయలకు అమ్ముతున్నట్లు నమోదు చేస్తూ మూడు వందలకు విక్రయిస్తున్నారని అప్పాజీపల్లి గ్రామానికి చెందిన రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం కొల్చారం మండలం అప్పాజీ పల్లి లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంటల నమోదు యాప్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ వచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మండలంలోని రంగంపేట, దుంపలకుంటలోని ఎరువుల దుకాణాలకు గత రెండు రోజుల క్రితం యూరియాసరఫరా కాగా బస్తా 300 రూపాయలు చొప్పున విక్రయించారని, ఈ విషయమై మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే సంబంధిత ఎరువుల దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ ను ఆదేశించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :