Saturday, 19 September 2026 08:41:28 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కరీంనగర్‌లో స్వయం రెస్టారెంట్–బాంకెట్ హాల్ ఘన ప్రారంభం

Date : 09 April 2026 03:04 PM Views : 101

DNB News - తెలంగాణ / : కరీంనగర్ నగరంలోని డిమార్ట్ రోడ్‌లో, ఈ ఎన్ గార్డెన్స్ ఎదురుగా నిర్మితమైన స్వయం రెస్టారెంట్, బాంకెట్ హాల్, గదుల సముదాయాన్ని బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొని యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆధునిక సదుపాయాలతో కూడిన రెస్టారెంట్లు, బాంకెట్ హాళ్లు అవసరం పెరుగుతున్నాయని తెలిపారు. స్వయం రెస్టారెంట్ వంటి సముదాయాలు ప్రజలకు మంచి వాతావరణంలో సేవలు అందించడమే కాకుండా, నగర అభివృద్ధికి తోడ్పడతాయని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలు ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త జైపాల్ రెడ్డి, ఎసిపి వెంకటస్వామి సిఐ తిరుమల్ స్థానిక కార్పొరేటర్లు ఒంటెల సత్యనారాయణ రెడ్డి, గుమ్మడి రాజ్ కుమార్, రమణారెడ్డి, బండారి వేణు పాల్గొన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు మడ్లపల్లి సాయి కృష్ణ, బూస సాయిశ్రవణ్ , అన్నిండ్ల ఉత్తేజ్ చేకుర్తి సురేందర్, సజ్జనపు సాయికుమార్ అతిథులను ఆహ్వానించి ఏర్పాట్లు చేశారు. అలాగే నాయకులు పొన్నం సత్యం, కృష్ణ గౌడ్, వెల్చాల తిరుమల్ రావు, మడ్లపల్లి శ్రీనివాస్, పడిదపల్లి కిషన్, రేండ్ల రాజిరెడ్డి, రామిడి రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులు సముదాయంలోని సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :