Saturday, 19 September 2026 07:59:01 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

సౌదీ అరేబియాలో గురువారం ఓ తెలుగు కుటుంబం దారుణ హత్యకు గురైంది.

Date : 28 February 2026 03:29 PM Views : 120

DNB News - తెలంగాణ / : తొలుత తల్లి, తండ్రి ని హతమార్చి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానిక మీడియా లో ప్రచారం జరిగింది. కువైట్ రాజధాని రియాధ్ నగరంలో తెలుగు ప్రవాసీయులు ఎక్కువగా నివసించే హరా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.అయితే,ఇండియా లోని బంధువులు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు.వారు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన గాలి రవి, గాలి శ్రీదేవి దంపతుల కుమారుడు యెజ్ర 12వ తరగతి చదువుతున్నాడు. ఆ దంపతులకు అతడు ఒక్కడే కొడుకు . ఆ కుటుంబం అందరితో కలసి మెలసి జీవనం సాగిస్తుండేది.రవి ,శ్రీదేవి దంపతులు వారి కొడుకు యెజ్ర చాలా బాగుండేవారని స్థానికులు చెప్తున్నారు.ఇక రవి రియాద్ లోని ఒక SAICO ఇన్సూరెన్స్ కంపెనీ లో సీనియర్ నెట్ వర్క్ ఇంజినీర్ గా,తల్లి శ్రీదేవి డిల్లీ పబ్లిక్ స్కూల్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. మృతులు స్థానికంగా అందరితో కలసిమెలసి ఉండేవారని అన్నారు. యెజ్ర స్థానిక డిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం సీబీయస్ఈ వార్షిక పరీక్షలు కూడా రాస్తున్నాడు. యెజ్ర అదే స్కూల్ లో చదువుతున్న జోర్డాన్ కు చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని బంధువులు తెలిపారు.తొలుత ఆ అమ్మాయి కూడా యెజ్ర అంటే ఇష్టపడిందని చెప్పారు.ఆ తర్వాత ఆ. అమ్మాయి యేజ్రా ను దూరం పెట్టిందని,అన్నారు.ఈ క్రమంలో యెజ్ర తన వద్ద ఉన్న పోటోలను అమ్మాయి తల్లితండ్రులకు పంపాడని అన్నారు.ఈ విషయం తెలిసి అమ్మాయి తల్లితండ్రులు దాదాపు నెల క్రితం యెజ్ర సహా రవి,శ్రీదేవిలను బెదిరించారని బంధువులు అన్నారు. ఆతర్వాత ఏమైందో తెలియదని చెప్పారు.కాగా గురువారం గుర్తు తెలియని నిందితులు ముందు రవి, శ్రీదేవిలను దారుణంగా హతమార్చారని బంధువులు చెప్పారు.రవి ఒంటిపై 30 కి పైగా కత్తిపోట్లు ఉన్నాయన్నారు.ఆ తర్వాత యెజ్ర ను ఇంకో చోటుకు తరలించి ఎత్తైన మేడ పై నుంచి తోసి చంపివేశారని వారు ఆరోపించారు. ఆ తర్వాత తల్లిదండ్రులను యెజ్ర హతమార్చి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చెప్తున్నారని వారు వాపోయారు. ఇప్పటికీ మృతదేహాలను కూడా చూడనీయడం లేదన్నారు. యెజ్ర కు తల్లితండ్రులు అంటే ఎంతో ప్రాణమని, ఇంత దారుణంగా ఎందుకు హత్య చేస్తాడని ప్రశ్నించారు. చుట్టూ పక్కల నివసించే వారు కూడా యెజ్ర గురించి చెప్తూ బాగా ఉండేవాడని, అందరితో కలసి ఉండేవాడని చెప్పారని అన్నారు. హత్య చేస్తే కనీసం షర్ట్ పై రక్తపు మరకలైన ఉంటాయి కదా అని వారు ప్రశ్నించారు.గత క్రిస్మస్ కు ఇండియా కు వచ్చిన వారు అందరితో ఆనందంగా గడిపారని కానీ ఇంతలోనే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు.ఈ ఘటన పై సౌదీ ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఆ నెల రోజుల్లో ఏం జరిగిందో దర్యాప్తు చేయాలన్నారు. యెజ్ర వాట్సప్ చాట్ పై విచారణ జరిపితే అన్ని విషయాలు తెలుస్తాయని వారు అన్నారు.భారత ఎంబసీ అధికారులు వెంటనే ఈ. విషయంలో తమకు సహాయం అందించాలని అభ్యర్థించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: