DNB News - తెలంగాణ / : ఎల్బీనగర్లోని స్పెషల్ పోక్సో కోర్టులో మంగళవారం మానవత్వం పరిమళించింది. దుస్తుల్లో పోలీస్, మనసులో అమ్మగా చైతన్యపురి PSలో విధులు నిర్వర్తిస్తున్న కోర్టు మహిళా కానిస్టేబుల్ దీప చేసిన పని అందరి మనసులను హత్తుకుంది. ఓ కేసు విచారణకు బాధితురాలు తన చంటి బిడ్డతో హాజరయ్యారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ వేళ ఆమె ఇబ్బంది పడకుండా ఉండేందుకు దీప చంటి పాపను లాలిస్తూ, ఆడించిన ఆమెను న్యాయవాదులు, సిబ్బంది అభినందించారు..!!
Admin
DNB News