DNB News - తెలంగాణ / : ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీపీటీ ట్రైనింగ్‌లో భాగంగా నిర్వహించిన రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ పోలీస్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. వివరాల ప్రకారం, రామవరప్పాడుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు పీపీటీ ట్రైనింగ్ కోసం మంగళగిరి ఆరో బెటాలియన్‌కు వచ్చారు. మంగళవారం నిర్వహించిన 3.2 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. అయితే రన్నింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురై ఛాతిని పట్టుకుని కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆయనను సమీపంలోని AIIMS మంగళగిరికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆయన గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనతో మంగళగిరి బెటాలియన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడు వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పోలీసులు సంతాపం వ్యక్తం చేశారు.
Admin
DNB News