Sunday, 02 August 2026 11:17:25 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

కరీంనగర్ మేయర్ పీఠం కాషాయం కైవసం.....

Date : 18 February 2026 11:08 AM Views : 92

DNB News - తెలంగాణ / : నూతనంగా ఎన్నికైన కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్లకు అభినందనలు *సీఎం రేవంత్ రెడ్డి .... మెజారిటీ సీట్లను సాధించిన బీజేపీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవి దక్కకుండా మంత్రులు, బీఆర్ఎస్, ఎంఐఎంతో కలిసి మీరు చేయని కుట్రలు లేవు. అయినా బండి సంజయ్ రాజకీయం ముందు, బీజేపీ సైనికుల పోరాట పటిమ ముందు మీ కుట్రలన్నీ పటాపంచులైనయ్. క్రికెట్ లో ఇండియాపై పాకిస్తాన్ ఘన విజయం సాధించినట్లుగానే, కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల కబడ్డీ ఆటలో... మీ అందరినీ ఓడించి బీజేపీ కప్ గెలుకుంది. ఈ వేదికగా ఇప్పుడు చెబుతున్నా... మీరు అనవసరంగా, అప్రజాస్వామికంగా నన్ను కెలికి ఆట మొదలుపెట్టారు. ఇక మీ ఆటకు నేను ముగింపు ఇస్తా’’అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి అల్టిమేటం ఇచ్చారు. ఈరోజు కరీంనగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం... నూతనంగా ఎన్నికైన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు. ఏమన్నారంటే.... కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటి కావడానికి కారణమేంటి? ప్రజాస్యామ్యాన్ని అపహాస్యం చేసేలా ఫాంహౌజ్ వేదికగా కుట్రలు ఎందుకు చేశారు? ఎవరిపై మీ కోపం? కాంగ్రెస్ గెలిచింది 14 సీట్లు, ఎంఐఎం గెలిచింది 3 సీట్లు, బీఆర్ఎస్ గెలిచింది 9 సీట్లు... అన్నీ కలుపుకున్నా 26 సీట్లు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ దాటనే లేదు. ఇవన్నీ తెలిసి ఎందుకు బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీ చీకటి ఒప్పందాలేమిటి? మేయర్, డిప్యూటీ మేయర్ లకు అభినందనలు తెలియజేస్తున్న. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండాను ఎగరేయాలని ఎన్నో ఏళ్లుగా కల కన్నం. ప్రజలంతా ఎదురు చూశారు. ఆ కల సాకారమైన ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నిన్న క్రికెట్ లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. కరీంనగర్ గడ్డపై జరిగిన ఈ మున్సిపల్ కబడ్డీ ఆటలో ఇతర పార్టీలన్న కుట్రలు చేసినా బీజేపీ మేయర్ కప్ గెలుచుకుంది. బీజేపీని ఓడించేందుకు చెప్పలేని, కంటికి కన్పించని కుట్రలెన్నో జరిగాయి. అధికారం చేతిలో ఉంది కదా అని... బీజేపీ 30 సీట్లు సాధించినా, ఇండిపెండెంట్లు మావైపు ఉన్నా... మమ్ముల్ని ఓడించేందుకు కుట్రలు జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలన్నీ కలిసి రెండ్రోజులుగా జరుగుతున్న కుట్రలను చూసి ప్రజలే విస్తుపోయారు. ఇన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకుంటున్నారా? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరిగింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలన్నా, తెలంగాణ వచ్చినా కరీంనగర్ వేదికగా మార్పు మొదలైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంటే రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలన్నీ ఒక్కటై కుట్ర చేశాయి. కానీ మేం ప్రజల సహకారం, అమ్మవారి ఆశీస్సులతో ఆ కుట్రలన్నీ భగ్నం చేశాం. 2005లొ ఇదే రోజున నేను కార్పొరేటర్ గా తొలిసారి ఎన్నికైనప్పుడు ఎంతో సంతోషపడ్డా. మళ్లీ ఈరోజు ఇదే కార్పొరేషన్ పై మేయర్ పీఠాన్ని బీజేపీని దక్కించుకున్నందుకు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంది. మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉంది. మా మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు గుణవంతులు, నీతిమంతులు... అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తారు. కార్పొరేషన్ లో అవినీతికి తావు లేకుండా ప్రజలకు అండగా ఉంటూ కరీంనగర్ అభివ్రుద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తరువాత అభివ్రుద్ధే మా లక్ష్యం. ఇందుకోసం అన్ని పార్టీలు కలిసి రావాలని కోరుతున్నా. కరీంనగర్ అభివ్రద్ధి విషయంలో ప్రజలు లేటైనా లేటెస్టుగా తీర్పునిచ్చారు. అధిక మెజారిటీని ఇచ్చి ఆశీర్వదించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసి కరీంనగర్ కు అత్యధిక నిధులు తెచ్చి అభివ్రుద్ధి చేసేందుకు యత్నిస్తా. బాధాకరమైన విషయం ఏంటంటే... బీజేపీకి మేయర్ పదవి రాకుండా ఉండేందుకు జరిగిన కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భాగస్వాములు కావడం ఆశ్చర్యం కలిగించింది. గత రెండ్రోజులుగా అనేక కుట్రలు చేశారు. ఇబ్బంది పెట్టారు. నేను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులు, ఎములాడ రాజన్న, కొండగట్టు అంజన్న, పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవార్ల దీవెనలతో వాటిని అధిగమించినం. నేనడుగుతున్నా... కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటి కావడానికి కారణమేంటి? ప్రజాస్యామ్యాన్ని అపహాస్యం చేసేలా ఫాంహౌజ్ వేదికగా కుట్రలు ఎందుకు చేశారు? ఎవరిపై మీ కోపం? కాంగ్రెస్ గెలిచింది 14 సీట్లు, ఎంఐఎం గెలిచింది 3 సీట్లు, బీఆర్ఎస్ గెలిచింది 9 సీట్లు... అన్నీ కలుపుకున్నా 26 సీట్లు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ దాటనే లేదు. ఇవన్నీ తెలిసి ఎందుకు బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీ చీకటి ఒప్పందాలేమిటి? మున్సిపల్ ఎన్నికలకు ముందు వాళ్లు(కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం) ఆట స్టార్ట్ చేశారు. బీజేపీ ఆ ఆటకు ముగింపు ఇవ్వబోతున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ కు ఛాలెంజ్ విసురుతున్నా... ఎక్కడికక్కడ 6 గ్యారంటీలను అమలు చేసేదాకా మీ మెడలు వంచుతాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పతనానికి ముగింపు పలుకుతాం. అందుకు కరీంనగరే వేదిక కాబోతోంది. గత రెండ్రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుట్రలను చూసి మేం భయపడలే. కనీస వ్యూహం, ఎత్తుగడలకు లేకుండా వ్యవహరించిన తీరును చూసి మేమంతా నవ్వుకున్నాం. ఈ విషయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల పంథాను చూసి అభినందించకుండా ఉండలేకపోతున్నా. ప్రజాస్వామ్య తీర్పును శిరసావహించాలనే ఉద్దేశంతో పార్టీ నిర్ణయానికి భిన్నంగా వ్యవహరించిన తీరు గొప్ప విషయం. ఒక్క బండి సంజయ్ ను అడ్డుకోవడానికి, బీజేపీ సైనికులను అడ్డుకోవడానికి హైదరాబాద్ శివారులోని లియోనియో రిసార్ట్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేయని కుట్రలు లేవు. అయినా ఏం సాధించారు? ఒక్క బండి సంజయ్ ను అడ్డుకోలేకపోయారు? బీజేపీ సైనికులను అడ్డుకోలేకపోయారు? కాంగ్రెస్ మేయర్ ఎన్నికలో ఎలాంటి కుట్ర లేదని, కాంగ్రెస్ కు సంబంధం లేదని ముఖ్యమంత్రి చెప్పే దుమ్ముందా? మీ కుట్ర ఉందని నేను నిరూపిస్తా. కరీంనగర్ మేయర్ ఎన్నిక విషయోం పూర్తిగా సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు పత్ర్యేక ధన్యవాదాలు. ఈ విషయంలో ఆయన చేయని సాయం లేదు. హ్యాట్సాఫ్... జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సహకరించారు. వారికి ధన్యవాదాలు. కరీంనగర్ గెలుపుకు ప్రధాన కారణం నరేంద్రమోదీ ఇచ్చిన నిధులు, చేసిన అభివ్రుద్ధే కారణం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహకారం మరువలేనిది. వీరితోపాటు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణసహా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎంతో సహకారం అందించారు. ముఖ్యంగా ఇతర జిల్లాల నుండి బీజేపీ కార్యకర్తలు వచ్చి కరీంనగర్ లో బీజేపీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన తీరు అభినందనీయం.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: