DNB News - తెలంగాణ / : “పూనా మార్గేమ్” పునరావాస కార్యక్రమం కింద ఒకేసారి 108 మంది మావోయిస్టు క్యాడర్లు ఆయుధాలు వదిలి సమాజ ప్రధాన ప్రవాహంలోకి చేరుతున్నారు. ఈ లొంగుబాటు నేపథ్యంలో వారు అందించిన సమాచారంతో దేశ చరిత్రలో ఇప్పటివరకు అత్యంత పెద్ద ఆయుధాల డంప్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ ఆయుధాల నిల్వను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో ప్రదర్శించనున్నారు. లాల్‌బాగ్లోని శౌర్య భవన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో స్వాధీనం చేసుకున్న భారీ ఆయుధాల నిల్వను అధికారికంగా ప్రదర్శించడంతో పాటు లొంగుబాటు చేసిన మావోయిస్టుల పునరావాస ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా భావిస్తున్నారు.
Admin
DNB News