DNB News - తెలంగాణ / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీఆర్‌ఎస్ బిసి నాయకుడు భూపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు, పేదలకు, కార్మికులకు అన్నదానం నిర్వహించి, వారికి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పార్టీకి అంకితభావంతో సేవలందిస్తున్న రేగా కాంతారావు నాయకత్వంలో జిల్లా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా నాయకుడికి నిజమైన శుభాకాంక్షలు తెలిపినట్టవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Admin
DNB News