DNB News - తెలంగాణ / : చిలకల గుట్ట వద్ద బూరుగుల పూజ పెద్దమ్మ తల్లి సమ్మక్క సారలమ్మ సామెత శివాలయం విశిష్ట పూజలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా జరుగుతున్న జాతీయ పండుగ మేడారం సమ్మక్క సారలమ్మల జాతరను పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పంచాయతీ పరిధిలోని గరీంపేట గ్రామంలో మంగళవారం నుంచి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన సభ్యులు కామిశెట్టి కొండలరావు శాంతాదేవి తెలిపారు. ఈనెల 22 తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు 28వ తేదీన సారలమ్మ వనం విడిచి గ్రామంలోకి వస్తుందని 29న సమ్మక్కను తీసుకువస్తామని 30వ తేదీన విశిష్ట పూజలను ఆచరించి 31న తిరిగి వనవాసానికి చేరుస్తామని తెలిపారు . కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు లక్ష మంది భక్తులు హాజరవుతారని తెలిపారు. ఆలయానికి తరలివచ్చే భక్తులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మూడు ధంజ బానోతు ఛాంద్య సాయిరాజ్ మంగీలాల్ ఆలయ పూజారి లింగాచారి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News