DNB News - తెలంగాణ / : మద్యం మత్తులో గొంతు కోసుకున్న యువకుడిని కాపాడిన 108 సిబ్బంది తాగిన మైకంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గొంతు కోసుకున్న దుర్గం వెంకటేష్ అనే యువకుడిని 108 అంబులెన్స్ సిబ్బంది చాకచక్యంగా కాపాడారు. వాంకిడి మండలంలోని ఇందాని గ్రామానికి చెందిన వెంకటేష్ తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుండగా, ఘటనాస్థలానికి చేరుకున్న EMT ప్రవీణ్ యాదవ్, పైలట్ సాయి వెంటనే రక్తస్రావాన్ని ఆపి, ప్రాథమిక చికిత్స అందించి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది సమయస్ఫూర్తితో యువకుడి ప్రాణాలు దక్కాయి
Admin
DNB News