Friday, 18 September 2026 07:42:36 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయములో కోటి కుంకుమార్చన యాగ మహోత్సవం

Date : 04 March 2026 10:18 AM Views : 133

DNB News - తెలంగాణ / : మహా యాగంలో పాల్గొను భక్తులు చిద్ డాట్ కామ్ ( సి.హెచ్ డి.హెచ్, సి ఓ ఎం) ద్వారా పేర్లు గోత్రములు రిజిస్టర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి దత్తాత్రేయ శర్మ కొత్తగూడెం పట్టణం ప్రగతి నగర్ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయం (శివాలయం)లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి కోటి కుంకుమార్చన మహాయాగ మహోత్సవాన్ని నిర్వహించ సంకల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది నుండి శ్రీరామనవమి పర్యంతము అనగా మార్చి 19,2026 నుండి మార్చి 28 శనివారం వరకు సకల భక్తజనుల రక్షణార్థం సకల ప్రజలకు సౌభాగ్య ఆరోగ్య ఆనంద ఐశ్వర్యాలు కలగాలని సంకల్పంతో పంచాయతన సహితంగా కోటికుంకుమార్చన మహాయాగమును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ,పూజించి, సేవించి జగదాంబ అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్య, ఆరోగ్య, ఆనంద ఐశ్వర్యాలు పొందగలరని కోరారు. రుణ బాధలు, రోగ బాధలు, దాంపత్య సమస్యలు.. ప్రధానమైనటువంటి సమస్యల నివారణ కోసం, పరాభవనామ సంవత్సరములో ప్రజలకు శుభములు లాభములు ఆనందములు సౌభాగ్యములు ఐశ్వర్యములు ఆరోగ్యములు కలగాలని సంకల్పంతో ఈ మహా యాగాన్ని నిర్వహించ సంకల్పించడం జరిగిందన్నారు. భక్తులందరూ కూడా విశేష దేవతా హోమములలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు.. పది రోజులు నిర్వహించేటటువంటి కోటి కుంకుమార్చనలో పాల్గొన ధరించిన భక్తులు చిద్ డాట్ కామ్.. యాప్ ద్వారా గానీ, వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: