DNB News - తెలంగాణ / : కోదాడ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ సుమారు రెండున్నర సంవత్సరాలు ముఖం చాటేసి ఇటీవలే జరిగిన స్థానిక ఎన్నికల గెల్పోటములను దృష్టిలో పెట్టుకొని మునగాల మండలంలో చిల్లర రాజకీయ గొడవలు సృష్టిస్తున్నది మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్,అని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలో సస్యశ్యామలంగా ఉన్న గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ సహకారంతో అధికార పార్టీ నాయకులపై అబండాలమోపే విధంగా గొడవలు సృష్టించి స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి పై ఇస్టాంసారంగా ఆరోపణలు చేయడం ఇకపై మానుకోవాలని తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే మల్లయ్య కు కోదాడ నియోజక ప్రజలు ప్రజాతీర్పు ద్వారా తగిన గుణపాఠం చెప్పిన ఇంకా బుద్ధి మారలేదని ఆవేదన వ్యక్తం పరిచారు.ఈకార్యక్రమంలో మునగాల గ్రామఉపసర్పంచ్ కాసర్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News