Saturday, 01 August 2026 05:55:02 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

Date : 09 June 2026 10:13 AM Views : 60

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆదివారం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా , ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైక్లింగ్, వ్యాయామాన్ని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వం పెరగడంతో పాటు వాహనాల వల్ల కలిగే కాలుష్యం తగ్గి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీ కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమై ఓల్డ్ కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్ మీదుగా సాగి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో సీఐలు గుణశేఖర్ బాబు, పార్థసారథి, ఆర్‌ఐలు నారాయణ, పోతల రాజు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత కల్పించడం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :