Monday, 03 August 2026 09:25:08 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్...

Date : 02 February 2026 06:07 PM Views : 124

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశించారు. కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (Public Grievance Redressal System) కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యల వినతులను ఎస్పీ స్వయంగా స్వీకరించి, ఫిర్యాదిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 125 ఫిర్యాదులు అందాయి. ప్రధాన ఫిర్యాదులు ఇవి : పత్తికొండ లక్ష్మీనగర్‌కు చెందిన లోకేష్ బాబు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు రూ.10 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన చిన్న లక్ష్మన్న, ఎమ్మిగనూరు టౌన్‌లోని తన ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ వద్ద రూ.1 లక్ష 10 వేల ఫోన్‌పే చేయించుకుని, రూ.50 వేలు మాత్రమే ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదు చేశారు. కర్నూలు బాలాజీ నగర్‌కు చెందిన మన్సూర్ అహ్మద్, రైల్వే, ఇన్‌కమ్ ట్యాక్స్, నామినేటెడ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఢిల్లీ, ముంబాయికి చెందిన వ్యక్తులు రూ.20 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదు చేశారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన విజయకుమార్, వృద్ధాప్యం మరియు అనారోగ్యంతో ఉన్న తనను కుమారుడు రవి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని న్యాయం చేయాలని కోరారు. కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీ ఉల్లా, తనపై చెడు ప్రయోగాలు చేసి ఆరోగ్యం క్షీణింపజేశారని, సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన అన్ని ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శివశంకర్, రమేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: