Wednesday, 16 September 2026 01:47:48 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలి: MHPS నూర్ అహ్మద్...

Date : 04 June 2026 11:55 AM Views : 108

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజించినప్పటికీ ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని మండలాన్ని విభజించాలని ప్రజల తరఫున డిమాండ్ చేసి సాధించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అదే చొరవతో నూతన ఆదోని రెండో మండలానికి అన్ని శాఖల్లో పూర్తి స్థాయి అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రస్తుతం రెండు మండలాలకు ఒకే తహసీల్దార్‌తో పాటు వివిధ శాఖల్లో ఒకే అధికారి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ప్రజా సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందని తెలిపారు. రైతులు, సాధారణ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ సంబంధిత పనులు సకాలంలో పూర్తికాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నూతన మండలం ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించడమేనని, అయితే ప్రత్యేక అధికారులు మరియు కార్యాలయాలు లేకపోవడంతో ఆ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి, నూతన ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారుల నియామకం, కార్యాలయాల ఏర్పాటు కోసం తక్షణ చర్యలు చేపట్టేలా కృషి చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: