DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆలూరు మండలంలో UTF శాఖ ఆధ్వర్యంలో దక్షిణాసియా సెపక్ తక్రా పోటీల్లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఆలూరు యువకుడు మధును ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా UTF నాయకులు మాట్లాడుతూ, చిన్న వయస్సు నుంచే సెపక్ తక్రా క్రీడపై ఆసక్తి పెంచుకున్న మధు కఠిన సాధనతో ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని తెలిపారు. మధు సాధించిన ఈ స్వర్ణ పతకం చరిత్రలో నిలిచిపోతుందని, అతన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతిభ ఎక్కడున్నా గుర్తించి గౌరవించడం సమాజ బాధ్యత అని వారు పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో UTF నాయకులు ఖాసిం, సురేష్ బాబు, జగదీష్, బసవరాజు, సుధాశేఖర్, సామన్న, మంగయ్య, షేక్షారావు, పార్థసారథి, చిన్నబాబు, రామాంజనేయులు, వీరేశ్, రవీంద్ర, సంజయ్, ప్రసాద్, శీను, రవి పాల్గొన్నారు. అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు గోవిందప్ప సార్ కూడా హాజరై మధును అభినందించారు.
Admin
DNB News