Thursday, 17 September 2026 02:10:06 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఉద్యాన సాగు వృద్ధే లక్ష్యం, జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక డి.ఆర్.డి.ఏ ద్వారా రుణాలు పాత్రికేయులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్

Date : 31 January 2026 12:58 PM Views : 118

DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయనగరం,: జిల్లాలో ఉద్యాన సాగుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా రైతుల్ని ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు.వరి పంట కంటే ఎక్కువ లాభం ఉద్యాన వనాల ద్వారా అందుతుందని,అందుకోసం జిల్లాలో 10 వేళా ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళిక రచించామని తెలిపారు.శుక్రవారం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ అనంతరం కలెక్టర్ మీడియా వారితో మాట్లాడారు.జిల్లాలో 696 రెవిన్యూ గ్రామాల్లో ఆదర్శ రైతుల్ని గుర్తించామని,వచ్చే ఖరీఫ్ నాటికి 6 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల కోసం ప్రణాళిక వేయడం జరిగిందన్నారు.స్వయం సహాయక సభ్యుల ద్వారా 5గురును గ్రూప్ గా చేసి స్త్రీ నిధి రుణాలను తక్కువ వడ్డీకే మంజూరు చేసి బోర్ వెల్స్ ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.5 ఎకరాల విస్తీర్ణంలో రైతుల ఎంపిక మేరకు ప్రకృతి వ్యవసాయానికి కూడా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన కూరగాయలు,ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు.విజయనగరం, విశాఖపట్నంలలో నున్న రైతు బజార్లకు వీరిని ట్యాగ్ చేయడం జరుగుతుందని,ప్రైవేట్ వర్తకులతో కూడా మాట్లాడడం జరుగుతుందన్నారు.ఆయిల్ పామ్ వలన కూడా లాభాలు వస్తాయని,నాలుగేళ్లలో చేతికి అధిక లాభాలు వస్తాయని,ఈ లోపల అంతర్ పంటలను కూడా వేసుకోవచ్చు నని పేర్కొన్నారు.జిల్లాలో సంప్రదాయ పంటల నుండి రైతును మళ్లించి వాణిజ్య పంటల దిశగా తీసుకువచ్చి, రైతుకు అధిక ఆదాయం సమకూర్చే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: