DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు అభివృద్ధి, పారిశుధ్య అంశాలను పరిశీలించారు. 94వ సందర్భంగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మ గుడి వద్ద భద్రతా చర్యలు, పారిశుధ్య ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని గుడి యాజమాన్యం మరియు మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. అనంతరం పట్టణంలోని కమ్యూనిటీ టాయిలెట్లు, పబ్లిక్ టాయిలెట్లను సందర్శించి పరిశుభ్రతపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎమ్మిగనూరు రోడ్‌లోని జివిపి పాయింట్లు, ఆర్య హోటల్ పరిసరాలు, సాహెబ్ దర్గా, తిక్క స్వామి దర్గా, బస్టాండ్ ప్రాంతాల్లో చెత్త రహితంగా మార్చిన ప్రదేశాలను పరిశీలించి అధికారులను అభినందించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో మర్చంట్ క్లబ్ ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా తగిన డ్రైనేజీ చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మరియు ఇంజినీరింగ్ అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, వీఆర్వోలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News