Thursday, 17 September 2026 05:47:19 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కేసీ కెనాల్ శుభ్రత పనులు పరిశీలించిన కలెక్టర్ డా. ఏ. సిరి – నదుల సంరక్షణ ప్రతి పౌరుని కర్తవ్యం..

Date : 23 February 2026 11:58 AM Views : 176

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యమని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పేర్కొన్నారు. శనివారం వినాయక ఘాట్ సమీపంలో KC Canal లో కొనసాగుతున్న శుభ్రత పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్‌తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పౌరుల బాధ్యతాయుత సహకారంతోనే నదుల సంరక్షణ ఫలప్రదమవుతుందని తెలిపారు. కెనాల్ పరిసర ప్రాంతాల్లో చెత్త పారవేయడాన్ని పూర్తిగా నిరోధించేందుకు మున్సిపల్ శానిటేషన్, జలవనరుల శాఖ సిబ్బంది ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. దెబ్బతిన్న రక్షణ వలయాలను తక్షణమే పునరుద్ధరించాలని, కెనాల్‌లోకి మురుగునీరు చేరుతున్న ప్రదేశాలను గుర్తించి వాటి మళ్లింపుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. నగర నడిబొడ్డున ప్రవహించే కెనాల్ నగర సౌందర్యానికి ప్రతీకగా నిలవాలని, అయితే నిర్లక్ష్యం కారణంగా అపరిశుభ్రత నెలకొనడం విచారకరమని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ప్రవాహం తగ్గిన సమయంలో దుర్వాసనలు, దోమల ప్రబలత వంటి సమస్యలు పెరిగి ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. రక్షణ కంచెలను ధ్వంసం చేసి వ్యర్థాలు పారవేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. కెనాల్ శుభ్రత, సంరక్షణ కోసం ప్రజాధనం వినియోగమవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రజలు చెత్తను మున్సిపల్ వాహనాలకే అప్పగించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డా. నాగ ప్రసాద్ బాబు, డిఈఈ పవన్ కుమార్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ఆర్. రాజు, నాగేశ్వరరావు, మల్లికార్జున, కోఆర్డినేటర్లు జయకృష్ణ, శ్రీనివాస్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: