Friday, 17 April 2026 03:48:54 PM
# గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం

ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో - ఎలగందుల సత్యనారాయణ.

Date : 15 April 2026 11:11 AM Views : 44

DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారతమాత ముద్దుబిడ్డ భారతరత్న రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దార్శనిక నాయకుడు, సాంఘిక సంస్కర్త అని ఆర్ఎస్ఎస్ జిల్లా సహసంఘ చాలకులు ఎలగందుల సత్యనారాయణ కొనియాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ బాధ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎలగందుల సత్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి తీవ్రమైన కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ, తన అద్భుతమైన విద్యా విజయాల ద్వారా ఆ సవాళ్లను అధిగమించి రాజ్యాంగ రూపకర్త అయ్యారని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యొక్క అత్యంత ప్రసిద్ధ నినాదం చదువుకోండి, పోరాడండి, సంఘటితం అవ్వండి . ఈ శక్తివంతమైన మూడు పదాల సందేశం సామాజిక సంస్కరణలకు స్ఫూర్తినిస్తుందన్నారు. మన దేశ అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన పోషించిన అసాధారణ పాత్ర కారణంగా డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ ను భారత రాజ్యాంగ పితామహుడయారన్నారు. “స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వాన్ని బోధించే మతం పట్ల హిందూ శబ్దానికి . హిందుత్వానికి విస్తృతమైన సమగ్రమైన నిర్వచనం ఆ రోజుల్లోనే అంబేద్కర్ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. చివరగా అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారని తెలిపారు. ఈకార్యక్రమంలో విభాగ్ ప్రచారక్ భానుచందర్ , విభాగ్ ప్రచార ప్రముక్ శంకరయ్య , మండల కార్యవాహా కామారపు ప్రసాద్ స్వయంసేవక బంధువులు పాల్గొన్నారు. మాధవ సేవా సమితి కరీంనగర్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కరీంనగర్లోని కేశవ నిలయం లో సమితి ప్రధాన కార్యదర్శి కామరపు ప్రసాద్, సభ్యులు ఎల్లoకి జలపతి రావు సంఘ ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం జరిగింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :