Saturday, 19 September 2026 10:28:13 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ప్రైవేట్ స్కూల్స్ అక్రమాలకు అండగా ఉన్న డిప్యూటీ డీఈఓను సస్పెండ్ చేయాలి – ఎస్‌ఎఫ్ఐ డిమాండ్...

Date : 23 April 2026 05:11 PM Views : 93

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు అండగా నిలుస్తున్న డిప్యూటీ డీఈఓను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ—పట్టణంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నప్పటికీ, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తమ పాఠశాలలో చేర్పించాలని ఒత్తిడి తెస్తూ, పుస్తకాలు, టై, బెల్ట్ పేర్లతో తల్లిదండ్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ డీఈఓ తన కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ అనేకమంది కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. డిప్యూటీ డీఈఓ తన నివాసాన్ని కార్యాలయంగా మార్చుకుని అక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు. ఏ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేయాలన్నా సాయంత్రం తర్వాత ఇంటికి రావాలని చెప్పడం వెనుక ఉన్న కారణం ఏమిటో వెల్లడించాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి, సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :