Saturday, 19 September 2026 11:26:19 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

తిరుమల పవిత్రతను కాపాడాలి: దుంపల రామారావు (లక్ష్మణ రావు)

Date : 04 April 2026 05:09 PM Views : 149

DNB News - ఆంధ్రప్రదేశ్ / : తిరుమల పవిత్రతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్‌ నాయుడిని వెంటనే తొలగించాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు వైఎస్సార్ సీపీ  శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ  దాస్ మరియు ధర్మాన రామ్మనోహర్నాయుడు ఆధ్వర్యంలో  శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ,నిరసన కార్యక్రమాలు చేపట్టారు.    భక్తి ముసుగులో రాజకీయాలా? "హిందువుల అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుమలపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం వేంకటేశ్వర స్వామిని వాడుకోవడం దారుణం. పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వారే అపవిత్రం చేస్తున్నారు" . తిరుమల పవిత్రత  విషయంలో చంద్రబాబు చేస్తున్న ద్రోహం  అంతా ఇంతా కాదు.  ఉద్దేశపూర్వకంగానే  తిరుమల పవిత్రతను  మంగగలిపేలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఒక  నీచుడునీ  వెంటపెట్టుకొని  తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు  ఆలయ పవిత్రత  గురించి మాట్లాడటం దెయ్యాలు  వేదాలు వళ్లించినట్లయింది. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పవిత్రమైన  క్షేత్రం  పాలక మండలి చైర్మన్  గా ఉండి పరాయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన బీ ఆర్ నాయుడును చంద్రబాబు కాపాడటం హేయం.    ఎన్ని విమర్శలు వచ్చినా, ఆరోపణలు వచ్చినా కళంకితుడైన బీ ఆర్ నాయుడును చంద్రబాబు వెనకేసుకురావడం అత్యంత దారుణం.    బీ ఆర్ నాయుడు విడియోలు  వైరల్ అయిన,ఇన్ని రోజులు గడిచినా ఆయనపై చర్య  తీసుకోవడం లో మీనమేషాలు లెక్కిస్తున్నారు. పైగా తిరుమలలో యదేచ్ఛగా దైవిక కార్యక్రమాల్లో  పాల్గొంటూ అపాచారాలకు పాల్పడుతున్నారు.   బీ ఆర్ నాయుడు నీ వెంటపెట్టుకొని  మరీ  దేవుడిని  దర్చించుకోవడం ,ఆ తరువాత కూడా అనేక కార్యక్రమాలు  బీ ఆర్ నాయుడు సమక్షం లో  చేయడం, ఇవన్నీ చూసిన తరువాత తిరుమల పవిత్రత కోసం ఆరాటపడుతున్న  ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు  తీరు చూసి తీవ్రంగా గా మండిపడుతున్నారు. తిరుమల తిరుపతి వంటి పుణ్యక్షేత్రంపై రాజకీయ ముద్ర వేయడం సరికాదని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్‌ నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) ఇచ్చాపురం దుంపల రామారావు (లక్ష్మణ రావు),పిన్నింటి సాయి కుమార్, అంబటి శ్రీనివాస రావు, ఎచ్చెర్ల శ్రీధర్ఎ,న్ని ధనుంజయ రావు, కరిమి రాజేశ్వరరావు,రాజపు అప్పన్న,  అందవరపు సూరిబాబు,మామిడి శ్రీకాంత్, ఆరంగి మురళి తదితర నాయకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: