Saturday, 01 August 2026 10:04:28 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

పీఎఫ్ బకాయిల పరిష్కారానికి సాయిప్రసాద్ రెడ్డి చొరవ అభినందనీయం : ఐఎఫ్‌టీయూ నాయకులు..

Date : 23 May 2026 10:33 AM Views : 53

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోనిలోని రాయలసీమ మిల్లులో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మిల్లు యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రాయలసీమ మిల్లు కార్మికుల పీఎఫ్ బకాయిల సమస్య పరిష్కారానికి మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమని ఐఎఫ్‌టీయూ నాయకులు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ బకాయిల కోసం కార్మికులు నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. సుమారు రూ.85 లక్షల పీఎఫ్ బకాయిల అంశంలో కోర్టులో స్టే ఉన్నప్పటికీ, సమస్య పరిష్కారానికి సాయిప్రసాద్ రెడ్డి ముందుకు రావడం కార్మికులకు ఊరటనిచ్చిందన్నారు. ఇంకా రూ.80 లక్షల వరకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, మిగిలిన సమస్యలు కూడా త్వరలో పరిష్కారం అవుతాయని ఆయన హామీ ఇచ్చారని కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. గత రెండు సంవత్సరాలుగా ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరంతర పోరాటం కొనసాగించారని, యాజమాన్యంతో జరిగిన చర్చల ఫలితంగానే ఈ సమస్యలో కదలిక వచ్చిందన్నారు. కార్మికుల పక్షాన నిలబడి సహకరించిన మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి ఐఎఫ్‌టీయూ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :