Saturday, 19 September 2026 05:17:54 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆటో డ్రైవర్ ఆవేదనకు స్పందించిన ఎమ్మెల్యే పార్థసారథి – తిమ్మప్పకు ఇంటికెళ్లి ధైర్యం..

Date : 13 March 2026 09:41 AM Views : 121

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కష్టపడి పనిచేసే పేదలపై భారీ జరిమానాలు వేయడం వల్ల వారి బతుకులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్‌కు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అండగా నిలిచారు ఆదోని మండలం గణేకల్లు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కుప్పయ్యగారి తిమ్మప్ప సోషల్ మీడియా వేదికగా తన గోడును వెల్లడించారు. రోజంతా కష్టపడితే రూ.400 నుండి 500 మాత్రమే వస్తుందని, అందులో ఎక్కువ భాగం పోలీసుల జరిమానాలకే వెళ్తోందని ఆయన కన్నీటి పర్యంతమవుతూ విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన తల్లి కూలీ పనికి వెళ్లి సంపాదించే రూ.200 తో కలిసి ఇల్లు గడుస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో భారీ పెనాల్టీలు వేస్తే పేదలు ఎలా బతకాలని తిమ్మప్ప ప్రశ్నించారు. అధికారులకు మానవతా దృక్పథం ఉండాలని ఆయన కోరారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వెంటనే స్పందించి తిమ్మప్ప ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆటో డ్రైవర్ పక్కన కూర్చుని ఆయన సమస్యలను అడిగి తెలుసుకుని భుజం తట్టి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం పేదలను ఇబ్బంది పెట్టకూడదని, నిబంధనల పేరుతో సామాన్యుల పొట్ట కొట్టడం సరికాదన్నారు. తిమ్మప్ప లాంటి కష్టజీవులకు అన్యాయం జరగకుండా చూస్తామని, ఈ విషయాన్ని సీఎం, డీసీఎం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి జరిమానాల వేధింపులు తగ్గించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న సామాన్యుడి పిలుపునకు స్పందించి నేరుగా ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే పార్థసారథిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: