DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహానేత, భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ 119వ జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆర్.ఎస్. రోడ్డులో ఉన్న డా. బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పుష్పాంజలి సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. డా. బాబూ జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడని, ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని మహానేతకు నివాళులు అర్పించారు.
Admin
DNB News