DNB News - ఆంధ్రప్రదేశ్ / : “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” అనే 100 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా, కోసిగి మండలం డి. బెలగల్ గ్రామంలోని నాగమ్మ చెరువును జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కూడా పాల్గొన్నారు. చెరువులో నీటి నిల్వలు, బండల స్థితి, సాగునీటి వినియోగం తదితర అంశాలను అధికారులు సమీక్షించారు. గ్రామస్థులు మరియు సాగు నీటి సంఘ సభ్యులతో కలెక్టర్ మాట్లాడి, నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా నీటి వనరుల సమర్థ వినియోగం, సంరక్షణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. రైతులు నీటిని వృథా చేయకుండా పంటలకు అవసరమైన మేరకు మాత్రమే వినియోగించాలని సూచించారు. స్థానిక అధికారులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Admin
DNB News