DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో కూటమి (టి.డి.పి, బి.జె.పి, జనసేన) పార్టీల నాయకుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమలు & వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి. భరత్ , రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లాలో కూటమి బలోపేతం, సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించగా, ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని నాయకులు నిర్ణయించారు. సమావేశంలో శాసనసభ్యులు కె.ఇ. శ్యాం కుమార్ (పత్తికొండ), బొగ్గుల దస్తగిరి (కోడుమూరు), బి.వి. జయనాగేశ్వర రెడ్డి (ఎమ్మిగనూరు), పి.వి. పార్ధసారథి (ఆదోని), బి.జె.పి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పరమహంస, జనసేన జిల్లా అధ్యక్షుడు చింతా సురేష్ పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ ఇంచార్జీలు ఎన్. రాఘవేంద్ర రెడ్డి (మంత్రాలయం), కె. మీనాక్షి నాయుడు (ఆదోని), వైకుంటం జ్యోతి (ఆలూరు), రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ ఎం. దేవేంద్రప్ప, ఆకెపోగు జయరాముడు (కోడుమూరు జనసేన ఇంచార్జి), హర్షద్ (కర్నూలు జనసేన ఇంచార్జి), ఎన్. మల్లప్ప (ఆదోని జనసేన ఇంచార్జి), జె. రేఖా గౌడ్ (ఎమ్మిగనూరు జనసేన ఇంచార్జి), బోయ కార్పొరేషన్ డైరెక్టర్ బి. మురళి నాయుడు, బి. సూర్య ప్రకాశ్ (బి.జె.పి కర్నూలు ఇంచార్జి), సునిల్ రెడ్డి (బి.జె.పి ఎం రాష్ట్ర అధ్యక్షులు), గురురాజ్ దేశాయి (బి.జె.పి ఎమ్మిగనూరు), తోళ్ళ మంజునాథ్, జి. వీరేష్ కుమార్, జి. చిన్న ఈరన్న తదితర కూటమి పార్టీల ముఖ్య నాయకులు హాజరయ్యారు.
Admin
DNB News