Friday, 18 September 2026 07:00:25 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

డిపిఓ కార్యాలయంలో మహిళా సిబ్బంది ఉత్సాహంగా ఆటల పోటీలు..

Date : 06 March 2026 10:24 AM Views : 141

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మహిళల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ హుస్సేన్ పీరా గారి పర్యవేక్షణలో ఈరోజు కర్నూలు డిపిఓ కార్యాలయంలో సిబ్బందికి ప్రత్యేకంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని టగ్ ఆఫ్ వార్ (Tug of War), షాట్ పుట్ (Shot Put), త్రో బాల్/టెన్నికాయిట్ (Tennikoit), మ్యూజికల్ చెయర్స్ (Musical Chairs) వంటి ఆటలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలు సిబ్బందిలో ఉత్సాహాన్ని పెంపొందించడమే కాకుండా పరస్పర సహకారం మరియు స్నేహభావాన్ని పెంపొందించడానికి దోహదపడినట్లు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారతకు, వారి ఆరోగ్యం మరియు సంతోషానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు మరియు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ఏవో విజయలక్ష్మి, డిపిఓ కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, ఆర్ ఐ నారాయణ, ఆర్ ఎస్ ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: