DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణం లో ఆదోని నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు నాయకత్వంలో, అలాగే టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్న ఆధ్వర్యంలో అరుణ్ జ్యోతి నగర్‌కు చెందిన సిద్ధ, సంజీవ్ తదితరులు వారి అనుచరులతో కలిసి సుమారు 200 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు కొత్తగా చేరిన వారిని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టిడిపి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఈ చేరికలు జరిగాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అరుణ్ జ్యోతి నగర్ ప్రాంతానికి చెందిన వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Admin
DNB News