Thursday, 17 September 2026 03:55:35 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

టీటీడీ లడ్డు కల్తీ నెయ్యి అంశానికి నిరసనగా కర్నూలులో వెంకటేశ్వరస్వామి ఆలయంలో సంప్రోక్షణ – తెలుగుదేశం పార్టీ

Date : 30 January 2026 11:32 AM Views : 132

DNB News - ఆంధ్రప్రదేశ్ / : 2019 నుంచి 2024 వరకు కొనసాగిన గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీలో ముమ్మాటికి కల్తీ నెయ్యి వాడినట్లు సిట్ అధికారులు తేల్చిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఈ రోజు కర్నూలు నగరంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొరకంచి రవికుమార్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం నందు పూజారుల సమక్షంలో దేవాలయ సంప్రోక్షణ నిర్వహించి, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, రాష్ట్ర డైరెక్టర్లు సంజీవ లక్ష్మి (బోయ కార్పొరేషన్), ఆనంద్ రావు (బ్రాహ్మణ కార్పొరేషన్) పాల్గొన్నారు. అలాగే జిల్లా పార్టీ కమిటీ సభ్యులు సోమిశెట్టి శ్రీకాంత్ (ఉపాధ్యక్షులు), రాజశేఖర రెడ్డి (కార్యాలయ కార్యదర్శి), కార్పొరేటర్లు సుంకన్న, కె. పరమేష్, పెనికలపాటి నాగేశ్వరరావు, రవి తదితరులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, తిరుమల లడ్డు వంటి పవిత్ర ప్రసాదంలో కల్తీ జరగడం అత్యంత దురదృష్టకరమని, ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తుల విశ్వాసాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని వారు స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :