Saturday, 19 September 2026 07:58:04 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఆదోనిలోని ఈఎస్ఐ హాస్పిటల్‌ను కర్నూలుకు తరలించవద్దు – కార్మిక సంఘాల డిమాండ్.

Date : 17 March 2026 03:39 PM Views : 95

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోనిలో గత 50 సంవత్సరాలుగా కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ఈఎస్ఐ హాస్పిటల్‌ను కర్నూలుకు తరలించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కార్మిక సంఘాలు మరియు ఈఎస్ఐ లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈఎస్ఐ లబ్ధిదారుల ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పి.ఎస్. గోపాల్, తిప్పన్న, ఈరన్న మరియు ఈఎస్ఐ లబ్ధిదారులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఈఎస్ఐ ఆసుపత్రిని ఈస్ట్, వెస్ట్‌గా విభజించి వైద్యం అందిస్తున్నప్పటికీ తగిన సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, ఈసీజీ వంటి పరీక్షల సౌకర్యం లేకపోవడం, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈఎస్ఐ లబ్ధిదారులకు సరైన వైద్యం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిలో సుమారు 3000 మంది ఈఎస్ఐ చందాదారుల కుటుంబాలు ఉన్నాయని, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ ప్రాంతాల కార్మికులు కూడా ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం ఆశించి వచ్చే కార్మికులు సరైన సదుపాయాలు లేక నిరాశతో తిరిగి వెళ్తున్న పరిస్థితి ఉందన్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, డాక్టర్లు మరియు అవసరమైన సదుపాయాలను కల్పించాలని, అలాగే ఈఎస్ఐ హాస్పిటల్‌ను కర్నూలుకు తరలించే నిర్ణయాన్ని నిలిపివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేవేంద్ర, తిక్కప్ప, శంకర్, మధు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: