Monday, 03 August 2026 01:11:05 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

రీ-సర్వేలో పారదర్శకతే లక్ష్యం : జేసీ నూరుల్ ఖమర్..

Date : 22 May 2026 10:46 AM Views : 63

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా పారదర్శకంగా పూర్తి చేయాలి నందవరం గ్రామంలో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జాయింట్ కలెక్టర్ రైతుల సమస్యలు తెలుసుకొని సర్వే సిబ్బందికి పలు సూచనలు చేసిన జేసీ జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. గురువారం నందవరం మండలం నందవరం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వ్యవసాయ భూములను సందర్శించి సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. భూ సరిహద్దుల నిర్ధారణ, ఫీల్డ్ మ్యాపింగ్, రికార్డుల పరిశీలన తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి, సర్వే సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, సందేహాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వే కార్యక్రమం ద్వారా రైతులకు భూసంబంధిత వివాదాలు లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించడమే లక్ష్యమని జేసీ పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఖచ్చితత్వంతో, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని ఆదేశించారు. గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, రైతుల సమక్షంలోనే భూ సరిహద్దులను నిర్ధారించాలని సర్వే బృందానికి సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి అభ్యంతరాలను వెంటనే నమోదు చేసి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రీ-సర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి భూ రికార్డులను ఆధునీకరించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అబ్దుల్ వహాబ్, ఉప తహశీల్దార్ మహేష్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాస రాజు, రెవెన్యూ సర్వే అధికారులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :