DNB News - ఆంధ్రప్రదేశ్ / : చీపురుపల్లి నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రి గౌ.శ్రీ. బొత్స సత్యనారాయణ (సత్తిబాబు)గారు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు గౌ.శ్రీ.మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను)గారు, మాజీ ఎంపీ,PAC మెంబర్ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువనాయకురాలు బొత్స అనూష గారు. చీపురుపల్లి నియోజకవర్గం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రి, పెద్దలు గౌ.శ్రీ. బొత్స సత్యనారాయణ (సత్తిబాబు)గారు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుకు దిశా నిర్దేశం చేసారు.గ్రామ స్థాయి నుండి పటిష్ట మైన నిర్మాణత్మాకమైన కమిటీలను తయారు చెయ్యాలని పంచాయతీలో గ్రామ కమిటీతో పాటు 7 అనుభంద విభాగలకు కమిటీలు వెయ్యాలని మండల స్థాయి నాయకులు ముఖ్యనాయకులతో గ్రామ కమిటీలు వేసేందుకు 2 పంచాయతీలకు ఒక క్లస్టర్ చేసి ఒకరిని క్లస్టర్ ఇంచార్జ్ గా వెయ్యాలని అలాగే 5 పంచాయతీలకు ఒక డివిజన్ క్లస్టర్ గా చేసి దానికి ఒక క్లస్టర్ ఇంచార్జ్ గా వెయ్యాలని వీరి ఆధ్వర్యంలో గ్రామాలలోకి వెళ్లి నాయకులు,కార్యకర్తలు అందరిని సమావేశపరచి పటిష్టమైన కమిటీ రూపొందించాలని తెలిపారు, 2029లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యడమే లక్ష్యంగా పనిచెయ్యాలని కోరారు. విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు గౌ.శ్రీ.మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను)గారు మాట్లాడుతూ వైస్సార్ పార్టీ లో ప్రతి కార్యకర్తకి గుర్తింపు వుటుంటుంది అని గ్రామస్తాయిలో నాయకులు అందరూ సమన్వయంతో పనిచెయ్యాలని కోరారు. సోషల్ మీడియా ప్రతినిధులు ప్రతి గ్రామం నుంచి యాక్టీవ్ గా వున్నవాళ్ళను నియమించాలని కోరారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో విఫలం అయ్యిందని రైతులకు యూరియా కూడా అందించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని అన్నారు.గ్రామస్తాయి నుంచి కూటమి నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రజలముందు సోషల్ మీడియా వేదికగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు,పార్టీ ప్రధాన కార్యదర్శి కె.వి సూర్యనారాయణ రాజు (పులిరాజు) గారు, మాజీ DCMS చైర్మన్ సిరువురు రమణరాజు ( పెదబాబు)గారు,జిల్లా పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు గారు,జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ ఇప్పిలి అనంతం,మండల పార్టీ అధ్యక్షులు మీసాల వరహాలనాయుడు,యూత్ అధ్యక్షులు బెల్లన వంశీ మరియు గరివిడి ఎంపీపీ నాయకులు మీసాల విశ్వేశ్వరావు, జడ్పీటీసీ వాకాడ శ్రీను, మెరకముడిదాం నాయకులు తాడ్డి వేణు,కోట్ల వెంకటరావు,బుర్లే నరేష్, గుర్ల మండల పార్టీ నాయకులు పొట్నూరు సన్యాసినాయుడు, జడ్పీటీసీ సీర అప్పలనాయుడు,బెల్లాన బంగారినాయుడు వైస్ ఎంపీపీలు,నియోజకవర్గ అనుబంధ విభాగాల సభ్యులు,ఎంపిటిసిలు, సర్పంచ్లు సోషల్ మీడియా కో-ఆర్డనేటర్స్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు, తదితరులు హాజరయ్యారు.
Admin
DNB News