DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ యువనేత నారా లోకేష్ మహిళా సాధికారత దిశగా కీలక ప్రకటన చేశారు. రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని మహిళా లోకం స్వాగతిస్తోందని వైకుంఠం జ్యోతి తెలిపారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా ఇది చారిత్రాత్మక అడుగని పేర్కొన్నారు. మహానాడు వేదికపై తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిందని ఆమె కొనియాడారు. మహిళల ఆత్మగౌరవం, రాజకీయ ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. “మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకం. మహిళా సాధికారతకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుంది” అని వైకుంఠం జ్యోతి అన్నారు.
Admin
DNB News