Thursday, 17 September 2026 01:24:27 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

VMRDA నిధులు, నియామకాలు, ఆదాయ–వ్యయాలపై సమగ్ర సమీక్ష నిర్వహించిన కూన రవికుమార్

Date : 24 January 2026 01:03 PM Views : 180

DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైజాగ్ మెట్రో రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ పనితీరుపై పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన సమావేశం వైజాగ్ మెట్రో రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వినియోగం, నియామకాలు, ఆదాయ–వ్యయాల వివరాలు, మొత్తం పనితీరుపై సమగ్రంగా సమీక్షించేందుకు అసెంబ్లీ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ (PUC) సమావేశాన్ని వైజాగ్ vmrda ఆఫీస్ లో నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు శ్రీ కూన రవికుమార్ అధ్యక్షత వహించారు. సమావేశంలో VMRDA ద్వారా అమలవుతున్న ప్రాజెక్టులు, ఆర్థిక వ్యవహారాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ????ఈ కార్యక్రమంలో పీయూసీ సభ్యులుగా పలాస శాసనసభ్యులు గౌతు శిరీష గారు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే NER గారు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా వర్ల గారు పాల్గొన్నారు. అలాగే VMRDA ఉన్నతాధికారులు, అసెంబ్లీ పీయూసీ కమిటీ అధికారులు కూడా హాజరయ్యారు. ????ఈ సందర్భంగా కూన రవికుమార్ మాట్లాడుతూ, “ప్రజాధనాన్ని అత్యంత పారదర్శకంగా వినియోగించాలి. అభివృద్ధి పనులు నిర్ణీత కాలపరిమితిలో పూర్తయ్యేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలి. ఆదాయ వనరులు పెంచుతూ, వ్యయాల్లో నియంత్రణ పాటించాలి” అని స్పష్టం చేశారు. నియామకాల విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా?, ఖాళీ పోస్టుల భర్తీ ఎలా జరుగుతోంది?, నిధుల కేటాయింపు మరియు ఖర్చుల మధ్య సమతుల్యత ఉందా? వంటి అంశాలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు చేశారు. VMRDA పనితీరును మరింత మెరుగుపరచేందుకు అవసరమైన మార్గదర్శకాలు, సూచనలను పీయూసీ కమిటీ అధికారులు vmrda అధికారులకు అందించారు. భవిష్యత్తులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం ద్వారా VMRDAలో జవాబుదారీతనం పెరుగుతుందని, అభివృద్ధి పనులు మరింత వేగంగాతాయని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: