DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది హాజరు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులు, నిర్వహిస్తున్న రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. వైద్య సేవల్లో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని, విధుల్లో వైద్యులు మరియు సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని ఆదేశించారు. రోగులకు సమయానికి చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Admin
DNB News