DNB News - ఆంధ్రప్రదేశ్ / : రహదారి ప్రమాదాల నియంత్రణే ప్రధాన లక్ష్యమని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పేర్కొన్నారు. ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధుల్లో పోలీసు అధికారులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, ఓవర్‌లోడ్‌తో వాహనాలు నడపరాదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని వివరించారు. 2026 జనవరి 1 నుంచి మే 8 వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ-చలానాలు నమోదు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి: ఓవర్ స్పీడ్ కేసులు – 3156 హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన కేసులు – 2569 సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు – 857 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు – 3206 ఓపెన్ డ్రింకింగ్ కేసులు – 6217 ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Admin
DNB News