Friday, 18 September 2026 08:11:05 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కార్పొరేట్ భాష్యం స్కూల్ ఆగడాలపై DSF, PDSO ఆగ్రహం...

Date : 08 May 2026 03:19 PM Views : 84

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న భాష్యం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఆదోని పట్టణంలోని కార్పొరేట్ భాష్యం పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌వో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌వో రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సమ్మర్ హాలిడేస్ ప్రకటించినప్పటికీ భాష్యం పాఠశాల యాజమాన్యం సెలవు దినాల్లో కూడా టీచర్లతో పని చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే “మా పాఠశాల.. మా ఇష్టం” అంటూ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో దురుసుగా మాట్లాడడం దారుణమన్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ముందస్తు అడ్మిషన్ల కోసం టీచర్లపై ఒత్తిడి తెస్తూ, ఒక్కో టీచర్‌కు నిర్దిష్ట సంఖ్యలో అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్లు విధించడం అన్యాయమని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. భాష్యం పాఠశాల యాజమాన్యంపై, అలాగే ప్రిన్సిపాల్ సురేంద్రపై సమగ్ర విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, హరి, విక్రమ్, పీడీఎస్‌వో నాయకులు రఘు, అమర్నాథ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :