Wednesday, 17 June 2026 05:16:40 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

జనరద్దీ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి: కమిషనర్ చల్లా ఓబులేసు..

Date : 12 May 2026 10:27 AM Views : 42

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగరంలో జనరద్దీ అధికంగా ఉండే రైతు బజార్లు, మార్కెట్ యార్డులు, పూల బజార్ ప్రాంతాల్లో పరిశుభ్రత పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశించారు. సోమవారం ఆయన కొండారెడ్డి బురుజు సమీపంలోని పూల బజార్, సి. క్యాంపు రైతు బజార్, వినాయక ఘాట్ వద్ద కే.సీ. కెనాల్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నిత్యం ప్రజల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పరిశుభ్రత పనులను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ఎక్కడా గార్బేజ్ పాయింట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి రోజు ఉదయం ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి, అదనపు సిబ్బందిని నియమించి విధులు కేటాయించాలని ఆదేశించారు. కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ ట్రాలీలలోనే చెత్తను వేయేలా వ్యాపారస్తులు, నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు కూడా పరిశుభ్రత పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛత పనుల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై అసహనం వ్యక్తం చేస్తూ, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు రమేష్, జిలానీ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :