Saturday, 19 September 2026 09:12:49 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

కర్నూలు పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ఆదోని జిల్లా అవసరం: 107వ రోజు రిలే నిరాహార దీక్షలో జేఏసీ నేతల స్పష్టం..

Date : 03 March 2026 12:41 PM Views : 150

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు పశ్చిమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, వలసల నివారణ, రైతుల సంక్షేమం కోసం ఆదోని జిల్లాను వెంటనే ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో 107వ రోజు రిలే నిరాహార దీక్షను ఆదోనిలో నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలు దీర్ఘకాలంగా అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వలసలు అధికమవడం, రైతుల ఆత్మహత్యలు, సరైన వైద్య సదుపాయాల లేమితో అంబులెన్సుల్లోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు, విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువులు మానేయాల్సి వస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. అలాగే కార్మికులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ప్రమాదకర పనుల్లో నిమగ్నమై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తగ్గాలంటే స్థానికంగా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు రావాలన్నారు. ఎత్తిపోతల నీటి ప్రాజెక్టులు లేక సాగునీరు అందక పొలాలు బీడుగా మారుతున్నాయని, పంటల దిగుబడి పెరగాలంటే నీటి వనరుల అభివృద్ధి అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అదనపు అభివృద్ధి నిధులు కోరడం లేదని, కేవలం ఆదోని జిల్లాగా ప్రకటిస్తే పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సహజంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదోని జిల్లా ప్రకటించాలని కోరుతూ తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. గతంలో కలగట్ల గ్రామంలో జరిగిన సభలో మెమరండం ఇవ్వడానికి వెళ్లినప్పుడు ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామని చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. 107వ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా దిబ్బనకల్లు ఉసేనప్ప, భూదెప్ప, కుమార్ (వైఎస్సార్ నగర్), గోవిందు, వెంకటేష్ దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో వై.పి. నాగరాజు, పగడాల కోదండ, టి. వీరేష్, సుజ్ఞానమ్మ, చంద్రబోస్, బండారి హనుమంతు, గుమ్మల బాలస్వామి, మలిగే రామలింగయ్య, గంగపుత్ర ప్రకాష్, జగదీష్, దాసరి నరేష్, దాసరి రామచంద్ర, దాసరి గోవిందరాజులు, జగన్ మాదిగ, వీరభద్ర స్వామి, రంగన్న తదితరులు పాల్గొని దీక్షను విజయవంతం చేశారు. ఆదోని జిల్లా ప్రకటించేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: